Sunday, March 22, 2009

పాలిటిక్స్ ఒక సేవ మార్గమ లేక కెరీర్ కోసమా

మరొకసారి భారత దేశం లో రాజకీయాలు మహాభారత గట్టాన్ని తలపిస్తున్నాయీ. అన్ని పార్టీలు శకుని బుద్దిని చూపిస్తూ సామాన్య జనాలని పిచ్చి వాళ్ళని చేస్తున్నాయీ. సామాన్య జనం వారి వేషాలు ఎనోట్ తెలిసి గూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈ సారి ఎన్నికలు క్రొత్త పుంతలు తోక్కుతున్నాయీ. అందరు రాజకీయాలలో వున్నా వ్యాపార సూత్రం బాగా వంట పట్టిచుకున్నారు. గోడ మీద పిల్లి గూడా వీళ్ళు వేసినాన్ని వేషాలు వేయదేమో.

చాల మంది నా లాంటి వాళ్ళు ఈ సమాజాన్ని మార్చటానికి ఏదో చేద్దాం అనుకుంటారు కాని ఎలా చేయటం. కేవలం వోటు వేయటం వల్ల దీనికి పరిష్కారం వుండి అని నేను అనుకోను. ముందు ఈ వోటింగ్ పద్దతి మారి నూతన పద్దతి రావాలని నేను కోరుకుంటున్న. ఎలెక్షన్ కమీషన్ ఎటువంటి వత్తిడులకు లోను కాకుండా దానిని స్వతంత్ర ప్రతిపతిగా మార్చాలి. మన వోటింగ్ విధానం లోనే కొంత మార్పిడి అవసరం. ఈ రోజుల్లో ప్రజలకు సేవ చేసే వుద్దేసంతో ఎవరు ముందుకు రావట్లేదు. ఒకరిద్దరు వచ్చిన వారు ఈ ధన రాజకీయాలు, కుటిల రాజకీయాల ముందు వెలవెల పోతున్నారు. లోక్సత్తా లాంటి పార్టీలు ప్రజలలోకి వెళ్ళలేక డబ్బు కర్చు పెట్టలేక మంచి వుద్దేసమున్న వెనక వుండి పోతున్నయ్యీ. ఎన్నో సంవస్తరాల రాజకీయ అనుభవం, ప్రజలకు సేవ చేసిన చరిత్ర వున్నా జయ ప్రకాష్ నారాయణ్ గూడా కేవలం సినిమా గ్లమౌర్ ముందు ఓటమి పాలుకవటం బాధగా వుంది.

అందుకనీ, ఈ ఎన్నికల ప్రకియను మర్చాలీ అని కోరుకుంటున్నాను. కేవలం పబ్లిక్ సర్వీసు చేసిన అబ్యార్డులని మాత్రమే ఎన్నికలలో పోటి చేసే అవకాసం ఇవాలి. ఎలాంటి క్రిమినల్ కేసు వున్నా వారిని కాంసిదర్ చేయగుడదు. లేక పోతే సంజయ్ దత్ లాంటి వాళ్ళు గూడా ప్రజాసేవ చేస్తాం అంటు రాజకీయాలలోకి వస్తారు.
అబ్యార్డులందరూ ప్రజలతో ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ వుందగూడదు. ఎలెక్షన్ కమీషన్ అబ్యార్డుల ప్రచారం తనే చేయాలి. అప్పుడు అన్డుఅరు అబ్యార్డులు తమ అభిప్రయాలను ప్రజలకు చెప్పే సమాన అవకాసం వుంటుంది. లేకపోతే డబ్బు వున్నా వాళ్ళు వారి చేతి వాతం ప్రదర్శిస్తారు. ఎలెక్షన్ కమీషన్ ఓపెన్ డిబేట్ ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఆలోచనలని ప్రజల ముందు పెట్టె ఏర్పాటు చేయాలి.
చివరిగా, ప్రజలు స్వతంత్రముగా వచ్చి వోటు వేసే విదానము వుండాలి. ఫై రెండు అమలు ఐన ఇది అమలు అవుటకు ఇంక కొంత సమయం పడుతుంది.

నేను చివరిగా చెప్పేది ఏమి తంతే, ఒక వ్యక్తి కో లేక ఒక పార్తికో కాకుండా మీ ఊరికి పనికి వచ్చే మనిచిని ఎన్నుకోండి. ఇంతకాలం రాజకీయాలు వేరు ఇప్పటి ఎన్నికలలు వేరు. ఈ సారి మన యూత్ జనాభా మునుపటికన్నా ఎక్కువ వుండి ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకొనే అవకాసం వుంది. తప్పక వోటు వేయండి.