Monday, April 13, 2009

స్వగతం రెండవ శీర్షిక

మొదటి బాగం తరువాయి

అలా నేను చేసిన అల్లరిని తట్టుకోలేక మా అమ్మమ్మ నన్ను విజయవాడ కి పంపాలి అని నిర్చయించారు. అప్పుడు నాన్న గారు నడింపాలెం లో వర్క్ చేసే వారు. మేము వేసవి సెలవలకి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం. అలా ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లల్లు రాజ, కిరణ్ కలిసి దీపావళికి మిగిలిపోయిన తాతకు టపాకాయలు, సీమతపాకాయలు తీసుకొని అవి కాల్చటం మొదలు పెట్టాము. నాకు బాగా గుర్తు, కిరణ్ అప్పుడు తాతకు టపాకాయలు నేలమీద కాదు గాలిలో ఎగిరేయాలి అని ఒకటి రెండు టపాకాయలు గాలిలోకి విసిరాడు. అంతే అవి అలా ఎదురింటి చెతకుప్పాలో పడి పెద్ద మంట రాజుకుంది. తర్వాత మాకు బాగా దేబల్లు పడ్డాయీ. నాకు అప్పుడు తెలియలేదు కాని నాకు తపసులతో వున్న అవినాభావ సంబంధం ఇప్పటికి కొనసాగుతోంది.

ఒకసారి నడింపాలెం లో నాన్న గారితో కలిసి తోట లోంచి వెళ్తుంటే ఒక పెద్ద కొండచిలువ ని చూసాము. అప్పుడే అది దేనినో తిని పడుకొని నిద్ర పోతోంది అని నాన్నగారు చెప్పారు. చాల బయం వేసింది దానికి చూడగానే.

వేసవి సెలవల తర్వాత, నన్ను విజయవాడకి పంపేసారు. నేను చాలా ఏడ్చాను కాని నా మాట ఎవరు వినలేదు. పెద్దమ్మ వాళింట్లో అందరికి పెదనాన్న గారంటే చాలా హడల్. నేను పెదనాన్న వస్తున్నారంటే మంచం కిందో, వరండాలోనో వుండే వాడిని. అప్పుడు నా వయసు ఐదు ఏళ్ళు. ప్రతిరోజు రాత్రి అమ్మ గుర్తుకు వచ్చి చాలా ఎద్చేవాడిని.
ఇప్పుడంటే, ఇంటర్నెట్ ఈమెయిలు సెల్ ఫోన్స్ వున్నయ్యే కాని అప్పట్లో మా వీదిలో ఒక ఫోన్ వున్నట్టు కూడా జ్ఞాపకం లేదు. ఐదు సంవస్తరాల వయసులో వుతరం రాసేంత చదువు లేదు నాకు. నేను మూడు నాలుగు నెలల వరకు అమ్మను చూసి ఎరుగను. ప్రతి రోజు అన్నం తినే వేళ అమ్మ బాగా గుర్తుకు వచెది. నాకు అన్నం ముందు నిద్ర వచ్చే అలవాటు వుందని చెప్పను కదా. అమ్మ ఐతే బుజ్జగించో, లాలించో అన్నం పెట్టేది. కాని పెద్దమ్మ పెదనాన్న పిల్లలని ఎక్కువ ముద్దు చేయగుడదు అని మాతో చాల స్ట్రిక్ట్ గా వుండేవారు. ఒకసారి, నేను అలాగే కంచం ముందు తూగుతూ వుంటే ఒక్కసారిగా నా మీద వర్షం పడినట్టు ఐంది. ఏమిటా అని చూద్దును కదా, మా పెదనాన్న గారు చెంబుడు నీళ్లు నా మీద పోసారు. మొత్తం బట్టలు, తల కంచం అన్ని నీళ్ళ మాయమ అయ్యయీ.

మిగతాది తర్వాత....

Sunday, April 5, 2009

స్వగతం మొదటి శీర్షిక

నేను పుట్టింది గుంటూరులో. గుంటూరు బ్రాడిపేట్ విజయలక్ష్మి నర్సింగ్ హోం లో. నేను పుట్టినప్పుడు చాల తెల్లగా వుండే వాడిని అని మా అమ్మ చెబుతూ వుండేది. నన్ను ఎవరినా ఎతుకోవాలని చుస్తే అమ్మ వద్దని గొడవ చేసేది. వాళ్ల దిష్టి నాకు తగిలి నేను ఎక్కడ నల్లగా అవుతానో అని అమ్మ భయం. నాన్న గారు హైదరాబాద్లో వుద్యోగం చేసే వారు. నాకు మా తాతయ్య గురించి అంతగా జ్ఞాపకం లేదు. కాని లీలగా ఆయనని నేను హైదరాబాద్ ఇంట్లో పడక కుర్చీలో చూసినట్టు జ్ఞాపకం. అంతకు మించి నాకు పెద్దగ అయన గురించి అంతగా జ్ఞాపకం లేదు.

మా నాయనమ్మ గారికి తొమ్మిది మంది సంతానం. ఐదుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు. నాన్నగారు మూడవ సంతానం. ఇంతమంది సంతానం వుండటం వల్లే నేమో ప్రేమలు తక్కువగా వుండేవి. మా అమ్మమ్మగారు గుంటూరులో టైలోరింగ్ వర్క్ చేసేవారు. అమ్మ, పెద్దమ్మ ఇద్దరు అమ్మమ్మకి సాయం చేసేవారు. మా మామయ్యలు ఇద్దరు అప్పుడు చదువుకొనేవారు. మా అమ్మమ్మ మా నాన్న గారి రెండవ అక్కయ్య. అమ్మ నాన్న వప్పుకోరు కాని అమ్మమ్మ చెబుతూ వుండేది వాళ్ళది ప్రేమ వివాహం అని.

నా చిన్నప్పుడు నేను మొదటి మూడు ఏళ్ళు హైదరాబాద్ లోనే వుండేవాడిని. తర్వాత వేసవి సెలవలకి మాత్రం వెళ్తూ వుండేవాడిని. నాకు బాగా గుర్తు వున్నసంగతులు కొన్ని. అప్పట్లో మేము చాల చిన్న గదిలో వుండే వాళ్ళం. అప్పుడు నాకు మూడు ఏళ్ళు వుంతయనుకుంట. ఒకసారి అమ్మ నాకు సాయత్రం పూట భోజనం పెడుతూ వుండి. వున్నట్టుండి కంచం మా ముందు నుంచి జరిగి గది చివరికి వెళ్ళింది. నాకు బాగా బయం వేసి అమ్మ అని అరిచి అమ్మని పట్టుకున్న. అప్పుడు నాన్నగారు ఇంట్లో లేరు. ఇంట్లో వున్న వస్తువులన్నీ ఒక్కసారిగా కదలటం మొదలుపెట్టాయీ. అంతే అమ్మ నన్ను ఎత్తుకొని ఇంట్లోనించి బయటకి తీసుకు వచ్చింది.

తర్వాత నేను గుంటూరు లో అమ్మమ్మ ఇంట్లో వుంటూ చదువుకొనే వాడిని. మేము జూపూడి వారి ఇంట్లో వుండే వాళ్ళం. నాకు బాగా గుర్తు, నన్ను పెద్ద మామయ్య సైకిల్ మీద రోజు స్కూల్ కి తేసుకువేల్లెవాడు. నేను కొంచం బొద్దుగా తెల్లగా వుండేవాడిని. అందరు నన్ను ఎతుకోతనికి, ముద్దు పెట్టుకోటానికి చూసేవారు. కాని మధ్యానం భోజనం తర్వాత మాత్రం ఎప్పుడు స్కూల్ లో వుండేవాడిని కాదు. రోజు ఇంటికి వచేసేవాడిని. ఇదే నేను చేసిన మొదటి తప్పు. అప్పట్లో నాన్నగారు గుంటూరు బీడీ ఆకుల ఫ్యాక్టరీ లో పని చేసేవారు. నాకు ఒక వింత అలవాటు వుండేది. నాకు నిద్ర తెప్పించటం చాలా తేలిక. నా ముందు అన్నం కంచం పెడితే చాలు ఎక్కడ లేని నిద్ర వచేసేది. అది ఎందుకో నాకు తెలియదు. మల్లి కంచం తీసేస్తే, నాకు నిద్ర వచ్చేది కాదు. నేను ఈ అలవాటుని వడులుకోతనికి చాలా టైం పట్టింది. అప్పట్లో జూపూడి వారు గుంటూరులో బాగా పేరు, డబ్బు వున్న వారు. వాళ్ళకి ఒక కార్ వుండేది. దాని డ్రైవర్ ప్రసాద్ (నేను అతనిని కార్ ప్రసాద్ అని పిలిచే వాడిని). నన్ను ఎతుకోవాలంటే కార్ ప్రసాద్ నాకు ఒక బిస్కట్ ప్యాకెట్ ఇవ్వాల్సిందే. లేక పోతే దగ్గరికి వెళ్ళే వాడిని కాను.

ఇలా రెండు ఏళ్ళు గడిచాక, నా చదువు సరిగా సాగ లేదని నన్ను విజయవాడ కి పంపాలని మా అమ్మమ్మ, పెద్దమ్మ నిర్చయం చేసారు. అప్పట్లో మా పెద్దమ్మ వాళ్ళు విజయవాడలో వుండే వాళ్ళు. పెదనాన్న గారు పోరహిత్యం చేస్తూ వుండే వాళ్ళు. ఆయనంటే మా ఇంట్లో అందరికి చాల గౌరవం, భయం గూడా.

మిగతావి తర్వాత.

Friday, April 3, 2009

మరోసారి జనం సొమ్ము నాశనం

మళ్ళి ఎన్నికలు వచ్చాయ్ మళ్ళి ప్రజల సొమ్ము మట్టిపాలు కానుంది. నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే గెలవమని తెలిసిన, గెలిచే వీలు లేకపోయినా సరే ఎంతో మంది తమ రాజ్యాంగ హక్కు అని ఎన్నికలలో పోటి చేస్తున్నారు. వాళ్ళు సరే, తప్పకుండ గెలిచే వల్ల పరిస్థితి వేరే ల వుంది.
నేను చిరంజీవి గురుంచి చెబుతున్నాను. అయన ఎక్కడినుంచి పోటి చేసిన తప్పక గెలిచే అవకాశమున్న వ్యక్తి. మరి అలాంటి చిరంజీవి రెండు చోట్ల నామినేషన్ ఎందుకు వేయాలి. తిరుపతి, పాలకొల్లు నమినషన్లు వేసి అయన తిరిగి వుపేన్నికలకు ఇప్పుడే రంగం సిద్ధం చేసారు. వారికి ప్రజల సొమ్ము మీద ఏమినా గౌరవం వుందా అని నేను అనుమనపడుతున్నాను.
ఇదేమీ మొదటి సరి కాదు. ఇంతకు ముందు తెలంగాణా రాష్ట్ర సమితి వాళ్ళు కాళీగా వుండి ఇలాగె రాజేనామలు చేసారు. కే సి అర్ ఐతే రెండు సార్లు ఇలాగె చేసారు.
ప్రజల మనో భావాల మీద ఈ రాజకీయ నాయకులకు ఏ మాత్రం గౌరవం లేదు. ఒకవేళ, చిరంజీవి తిరుపతిలో పాలకొల్లు లో గెలిస్తే (ఇది తప్పక జరుగుతుంది) వారు ఎవరిని ఎన్నిక చేసుకుంటారు. తిరుపతి నో పలక్కొల్లు నో ఏదో వకతినే ఎన్నుకుంటే, మరి ఆ రెండో ఊరి ప్రజలను మోసం చేసినట్టు కాదా. వాళ్ళు చిరంజీవి మీద వుంచిన విశ్వాసం మాట ఏమిటి.
అందుకే ఈ రాజ్యాంగం మార్చాలి. ఇక నించి, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటి చేస్తే, అలా పోటి చేసే vakthi నించి కొంత సొమ్ము prabuthvaniki kattela rajyamgam marchali. లేకపోతే, ఈ రాజకీయ nayakulu eppatiki maararu.
thirupatho లేక palakollo ఏదో vakati chiranjeeviki దూరం avatam kayam.