Monday, April 13, 2009

స్వగతం రెండవ శీర్షిక

మొదటి బాగం తరువాయి

అలా నేను చేసిన అల్లరిని తట్టుకోలేక మా అమ్మమ్మ నన్ను విజయవాడ కి పంపాలి అని నిర్చయించారు. అప్పుడు నాన్న గారు నడింపాలెం లో వర్క్ చేసే వారు. మేము వేసవి సెలవలకి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం. అలా ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లల్లు రాజ, కిరణ్ కలిసి దీపావళికి మిగిలిపోయిన తాతకు టపాకాయలు, సీమతపాకాయలు తీసుకొని అవి కాల్చటం మొదలు పెట్టాము. నాకు బాగా గుర్తు, కిరణ్ అప్పుడు తాతకు టపాకాయలు నేలమీద కాదు గాలిలో ఎగిరేయాలి అని ఒకటి రెండు టపాకాయలు గాలిలోకి విసిరాడు. అంతే అవి అలా ఎదురింటి చెతకుప్పాలో పడి పెద్ద మంట రాజుకుంది. తర్వాత మాకు బాగా దేబల్లు పడ్డాయీ. నాకు అప్పుడు తెలియలేదు కాని నాకు తపసులతో వున్న అవినాభావ సంబంధం ఇప్పటికి కొనసాగుతోంది.

ఒకసారి నడింపాలెం లో నాన్న గారితో కలిసి తోట లోంచి వెళ్తుంటే ఒక పెద్ద కొండచిలువ ని చూసాము. అప్పుడే అది దేనినో తిని పడుకొని నిద్ర పోతోంది అని నాన్నగారు చెప్పారు. చాల బయం వేసింది దానికి చూడగానే.

వేసవి సెలవల తర్వాత, నన్ను విజయవాడకి పంపేసారు. నేను చాలా ఏడ్చాను కాని నా మాట ఎవరు వినలేదు. పెద్దమ్మ వాళింట్లో అందరికి పెదనాన్న గారంటే చాలా హడల్. నేను పెదనాన్న వస్తున్నారంటే మంచం కిందో, వరండాలోనో వుండే వాడిని. అప్పుడు నా వయసు ఐదు ఏళ్ళు. ప్రతిరోజు రాత్రి అమ్మ గుర్తుకు వచ్చి చాలా ఎద్చేవాడిని.
ఇప్పుడంటే, ఇంటర్నెట్ ఈమెయిలు సెల్ ఫోన్స్ వున్నయ్యే కాని అప్పట్లో మా వీదిలో ఒక ఫోన్ వున్నట్టు కూడా జ్ఞాపకం లేదు. ఐదు సంవస్తరాల వయసులో వుతరం రాసేంత చదువు లేదు నాకు. నేను మూడు నాలుగు నెలల వరకు అమ్మను చూసి ఎరుగను. ప్రతి రోజు అన్నం తినే వేళ అమ్మ బాగా గుర్తుకు వచెది. నాకు అన్నం ముందు నిద్ర వచ్చే అలవాటు వుందని చెప్పను కదా. అమ్మ ఐతే బుజ్జగించో, లాలించో అన్నం పెట్టేది. కాని పెద్దమ్మ పెదనాన్న పిల్లలని ఎక్కువ ముద్దు చేయగుడదు అని మాతో చాల స్ట్రిక్ట్ గా వుండేవారు. ఒకసారి, నేను అలాగే కంచం ముందు తూగుతూ వుంటే ఒక్కసారిగా నా మీద వర్షం పడినట్టు ఐంది. ఏమిటా అని చూద్దును కదా, మా పెదనాన్న గారు చెంబుడు నీళ్లు నా మీద పోసారు. మొత్తం బట్టలు, తల కంచం అన్ని నీళ్ళ మాయమ అయ్యయీ.

మిగతాది తర్వాత....

3 comments:

నేస్తం said...

చాలా బాగా రాస్తున్నారు ..అమ్మ దగ్గర లేకపోతే పిల్లల మనసు ఎంత తల్లడిల్లుతుందో కదా

ammulu said...

nee sirshikalu chala bavuntunnayi

BujjiGadu said...

Annaya
Super Ga Rasavu.
Continue Cheyi.
Dont Break It.

Bue