Sunday, April 5, 2009

స్వగతం మొదటి శీర్షిక

నేను పుట్టింది గుంటూరులో. గుంటూరు బ్రాడిపేట్ విజయలక్ష్మి నర్సింగ్ హోం లో. నేను పుట్టినప్పుడు చాల తెల్లగా వుండే వాడిని అని మా అమ్మ చెబుతూ వుండేది. నన్ను ఎవరినా ఎతుకోవాలని చుస్తే అమ్మ వద్దని గొడవ చేసేది. వాళ్ల దిష్టి నాకు తగిలి నేను ఎక్కడ నల్లగా అవుతానో అని అమ్మ భయం. నాన్న గారు హైదరాబాద్లో వుద్యోగం చేసే వారు. నాకు మా తాతయ్య గురించి అంతగా జ్ఞాపకం లేదు. కాని లీలగా ఆయనని నేను హైదరాబాద్ ఇంట్లో పడక కుర్చీలో చూసినట్టు జ్ఞాపకం. అంతకు మించి నాకు పెద్దగ అయన గురించి అంతగా జ్ఞాపకం లేదు.

మా నాయనమ్మ గారికి తొమ్మిది మంది సంతానం. ఐదుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు. నాన్నగారు మూడవ సంతానం. ఇంతమంది సంతానం వుండటం వల్లే నేమో ప్రేమలు తక్కువగా వుండేవి. మా అమ్మమ్మగారు గుంటూరులో టైలోరింగ్ వర్క్ చేసేవారు. అమ్మ, పెద్దమ్మ ఇద్దరు అమ్మమ్మకి సాయం చేసేవారు. మా మామయ్యలు ఇద్దరు అప్పుడు చదువుకొనేవారు. మా అమ్మమ్మ మా నాన్న గారి రెండవ అక్కయ్య. అమ్మ నాన్న వప్పుకోరు కాని అమ్మమ్మ చెబుతూ వుండేది వాళ్ళది ప్రేమ వివాహం అని.

నా చిన్నప్పుడు నేను మొదటి మూడు ఏళ్ళు హైదరాబాద్ లోనే వుండేవాడిని. తర్వాత వేసవి సెలవలకి మాత్రం వెళ్తూ వుండేవాడిని. నాకు బాగా గుర్తు వున్నసంగతులు కొన్ని. అప్పట్లో మేము చాల చిన్న గదిలో వుండే వాళ్ళం. అప్పుడు నాకు మూడు ఏళ్ళు వుంతయనుకుంట. ఒకసారి అమ్మ నాకు సాయత్రం పూట భోజనం పెడుతూ వుండి. వున్నట్టుండి కంచం మా ముందు నుంచి జరిగి గది చివరికి వెళ్ళింది. నాకు బాగా బయం వేసి అమ్మ అని అరిచి అమ్మని పట్టుకున్న. అప్పుడు నాన్నగారు ఇంట్లో లేరు. ఇంట్లో వున్న వస్తువులన్నీ ఒక్కసారిగా కదలటం మొదలుపెట్టాయీ. అంతే అమ్మ నన్ను ఎత్తుకొని ఇంట్లోనించి బయటకి తీసుకు వచ్చింది.

తర్వాత నేను గుంటూరు లో అమ్మమ్మ ఇంట్లో వుంటూ చదువుకొనే వాడిని. మేము జూపూడి వారి ఇంట్లో వుండే వాళ్ళం. నాకు బాగా గుర్తు, నన్ను పెద్ద మామయ్య సైకిల్ మీద రోజు స్కూల్ కి తేసుకువేల్లెవాడు. నేను కొంచం బొద్దుగా తెల్లగా వుండేవాడిని. అందరు నన్ను ఎతుకోతనికి, ముద్దు పెట్టుకోటానికి చూసేవారు. కాని మధ్యానం భోజనం తర్వాత మాత్రం ఎప్పుడు స్కూల్ లో వుండేవాడిని కాదు. రోజు ఇంటికి వచేసేవాడిని. ఇదే నేను చేసిన మొదటి తప్పు. అప్పట్లో నాన్నగారు గుంటూరు బీడీ ఆకుల ఫ్యాక్టరీ లో పని చేసేవారు. నాకు ఒక వింత అలవాటు వుండేది. నాకు నిద్ర తెప్పించటం చాలా తేలిక. నా ముందు అన్నం కంచం పెడితే చాలు ఎక్కడ లేని నిద్ర వచేసేది. అది ఎందుకో నాకు తెలియదు. మల్లి కంచం తీసేస్తే, నాకు నిద్ర వచ్చేది కాదు. నేను ఈ అలవాటుని వడులుకోతనికి చాలా టైం పట్టింది. అప్పట్లో జూపూడి వారు గుంటూరులో బాగా పేరు, డబ్బు వున్న వారు. వాళ్ళకి ఒక కార్ వుండేది. దాని డ్రైవర్ ప్రసాద్ (నేను అతనిని కార్ ప్రసాద్ అని పిలిచే వాడిని). నన్ను ఎతుకోవాలంటే కార్ ప్రసాద్ నాకు ఒక బిస్కట్ ప్యాకెట్ ఇవ్వాల్సిందే. లేక పోతే దగ్గరికి వెళ్ళే వాడిని కాను.

ఇలా రెండు ఏళ్ళు గడిచాక, నా చదువు సరిగా సాగ లేదని నన్ను విజయవాడ కి పంపాలని మా అమ్మమ్మ, పెద్దమ్మ నిర్చయం చేసారు. అప్పట్లో మా పెద్దమ్మ వాళ్ళు విజయవాడలో వుండే వాళ్ళు. పెదనాన్న గారు పోరహిత్యం చేస్తూ వుండే వాళ్ళు. ఆయనంటే మా ఇంట్లో అందరికి చాల గౌరవం, భయం గూడా.

మిగతావి తర్వాత.

2 comments:

Bhãskar Rãmarãju said...

మీరు పుట్టిన నర్శింగ్ హోం వెనుకవీధిలో మేముండే వాళ్లం. కంటి డాక్టర్, ఓ మాధవ కళ్యాణి, వాళ్ల పిల్లలు అందరూ తెలుసు నాకు.

Bhãskar Rãmarãju said...

వర్డ్ వెరిఫికేషన్ తీసేయ్యండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు.